Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, గౌతమి, రావు రమేష్, నరేష్ వికె నటీనటులుగా బివి నందిని రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకంపై రూపొందిన చిత్రం 'అన్నీ మంచి శకునములే'. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర టైటిల్ ట్రాక్ లాంచింగ్ ఈవెంట్‌ని ఉగాది పండగ వాతావరణంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ పాటని కార్తీక్ పాడగా, రెహమాన్ సాహిత్యం అందించారు. 'రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. వేసవిలో మన అమ్మమ్మ ఇంటికి వెళితే ఎంత హాయిగా ఉంటుందో అలాంటి కథ ఇది. ఈ వేసవికి చల్లని చిరుగాలి లాంటి సినిమా' అని దర్శకురాలు నందినిరెడ్డి అన్నారు. 'మంచి కథ, సంగీతంతో ఒక సినిమా చూస్తుంటే ఆ హాయి, ఆనందం వేరు. అంత హాయిగా సాగే సినిమా ఇది. గౌతమి, వాసుకి చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో నటిస్తున్నారు. నందిని రెడ్డి అద్భుతంగా తీసింది' అని నిర్మాత అశ్వినీదత్ చెప్పారు. 'టైటిల్‌కి తగ్గట్టుగానే ఇక నుంచి నాకు అన్నీ మంచి శకునములే' అని హీరో సంతోష్ శోభన్ చెప్పారు. ఈ చిత్రాన్ని మే 18న విడుదల చేస్తున్నారు.