Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ తమ్ముడు రఘు తనయుడు మాధవ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో దర్శకురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. రాఘవేంద్రరావు చేతుల మీదుగా దర్శక, నిర్మాతలకు స్క్రిప్ట్‌ను అంద జేశారు. అలాగే హీరోపై క్లాప్ నివ్వగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'ఈ సినిమా దర్శకురాలు గౌరి 'పెళ్లి సందడి' ఫ్లేవర్‌లో కాకుండా పూర్తి భిన్నంగా ఉంటుంది' అని తెలిపారు. 'ఇది చాలా యూత్‌ఫుల్‌గా సాగే కలర్‌ఫుల్ సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ కథ విని బాగా ఇంప్రెస్ అయ్యారు' అని దర్శకురాలు చెప్పారు. హీరో మాట్లాడుతూ, 'ఓ మంచి కథతో రూపొందుతున్న చిత్రంలో భాగమైనందుకు హ్యాపీగా ఉంది' అని అన్నారు.