Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిక్స్టీన్స్ సీక్వెల్‌గా ఆ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కష్ణ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో స్వీయ దర్శ కత్వంలో నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ రిస్క్. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబో తున్న ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ తెలుగులో పాడిన సొగసుకే సోకు, ఇత్ని ఖూబ్ సూరత్ హిందీలో మహమ్మద్ హైమత్ పాడిన అజ్హ్హగుకే అజ్హ్హగూట్టన్, తమిళ్లో సింగర్ అర్జున్ విజయ్, సొగసిగే మెరుగు కన్నడ గీత రచనతో సింగర్ సిద్ధార్థ్ బేలమన్ను పాడారు. శుక్రవారం ఆదిత్యా మ్యూజిక్ ద్వారా ఈ నాలుగు పాటలను విడుదల చేసారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు తెలుగు లిరికల్ సాంగ్‌ని, తెలుగు మోషన్ పోస్టర్ని మైత్రి మూవీ మేకర్స్ అధినేత యలమంచిలి రవి శంకర్ రిలీజ్ చేశారు. హిందీ లిరికల్ సాంగ్‌ను హీరో ఆదిత్య ఓం రిలీజ్ చేయగా, తమిళ లిరికల్ సాంగ్‌ని ఉప్పల్ ఏం.ఎల్.ఏ బేతి సుభాష్ రెడ్డి, కన్నడ లిరికల్ సాంగ్‌ని తెలంగాణ బి సి కమిషన్ చైర్మన్ వకుళాభరణ రామకష్ణ రావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు ఘంటాడి కష్ణ మాట్లాడుతూ,సిక్స్టీన్స్కి సీక్వెల్‌గా వస్తున్న రిస్క్, ఇందులోని పాటలు అందర్నీ బాగా అలరిస్తాయని ఆశిస్తున్నాను అని అన్నారు.