Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వరంగల్
వరుసగా మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో రెండోసారి ఛాంపియన్ షిప్ టైటిల్‌ను గెలిచిన నిఖత్ జరీన్‌కు రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు తెలిపారు. ఆదివారం ఐబీఏ మహిళ ప్రపంచ బాక్సింగ్ 50 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో నిఖత్ జరీన్ వియత్నం దేశానికి చెందిన న్గుయెన్ థి టామ్‌ను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. ఈ పోటీల్లో శక్తివంతమైన పంచ్‌లతో ప్రత్యర్థిని మట్టికరిపించి బంగారు పతకం కైవసం చేసుకోవడం అభినందనీయమని మంత్రి అన్నారు. తెలంగాణ గౌరవాన్ని చిరస్థాయిలో నిలిచిపోయేలా నిఖత్ ప్రతిభను కనబరిచారని కొనియాడారు. ఐబీఏ ఛాంపియన్‌షిప్‌లో రెండో సారి విజేతగా చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. ఆమె విజయపరంపరను ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. ప్రతీ గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి, యువ క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని తెలిపారు. నిఖత్ జరీన్ విజయం యావత్ భారత జాతి తెలంగాణ బిడ్డ ప్రతిభను చూసి గర్విస్తోందన్నారు.