Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ సినీ చరిత్రలో ఆస్కార్ అందుకున్న తొలి తెలుగు సినిమాగా 'ఆర్ఆర్ఆర్' చరిత్ర సృష్టించింది. ఇందులోని 'నాటు..' పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంగా ఆస్కార్ పురస్కారం దక్కిన విషయం విదితమే. అయితే ఆస్కార్ ప్రమోషన్ కోసం రాజమౌళి బృందం రూ.80 కోట్లు ఖర్చు చేసిందనే వార్తలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాజమౌళి తనయుడు కార్తీకేయ దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'హాలీవుడ్ సినిమాకు అయితే బిగ్ స్టూడియోస్ పబ్లిసిటీని చూసుకుంటాయి. 'ఆర్ఆర్ఆర్' కు అంత ఖర్చు చేసే స్టూడియో లేదు. క్యాంపెన్ కోసం మేము అనుకున్న బడ్జెట్ రూ.5 కోట్లు. అయితే నామి నేషన్స్ వచ్చిన తర్వాత మరికొంత బడ్జెట్ పెంచాం. దీంతో రూ.8.5కోట్లు అయింది' అని తెలిపారు.అయితే కార్తీకేయ చెప్పిన ఖర్చుపై సోషల్ మీడియాలో 'ఎట్టెట్టా..' ఇది సాధ్యమా?, మరీ ఇంత భారీ తేడా ఉండటం విడ్డూరమంటూ నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.