Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు ఉదయ్ శంకర్ కొత్త సినిమా ఫిల్మ్ నగర్ టెంపుల్లో సోమవారం ఘనంగా ప్రారంభం అయింది. మన్మోహన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై డాక్టర్ సౌజన్య ఆర్ అట్లూరి సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీరామ్ సార్ ముహూర్త షాట్‌కు క్లాప్ కొట్టగా, దినేష్ చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ, 'హీరోగా నాకు ఇది ఐదో సినిమా. ఈ బ్యానర్లో రెండో సినిమా. నిర్మాత నారాయణరావుతో మరోసారి అసోసియేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. 'నచ్చింది గర్ల్ ఫ్రెండ్' తర్వాత మధునందన్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ మూవీలో అతనిది చాలా ఇంపార్టెంట్ రోల్. హిలేరియస్‌గా సాగే ఎగ్జైటింగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మధునందన్ బ్రదర్ మన్మోహన్ అద్భుతమైన స్క్రిప్ట్‌తో వచ్చాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుంది. అతి త్వరలోనే రెగ్యులర్ షూట్‌కు వెళ్లబోతున్నాం' అని తెలిపారు. మధునందన్ మాట్లాడుతూ, 'ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న మన్మోహన్ నా సొంత బ్రదర్. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకి థ్యాంక్యూ. ఉదయ్‌కి ఈ చిత్రం సూపర్ హిట్ ఇస్తుందని చెప్పగలను' అని అన్నారు. 'ఈ మూవీ ఏప్రిల్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. ఈ షెడ్యూల్లో మొత్తం కాస్ట్ అండ్ క్రూ ఉంటుంది. ఇది ఫ్యామిలీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు ఒక చిన్న ప్రేమకథ కూడా మిక్స్ అయి ఉంటుంది. మీ అందరికీ ఈ కథ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని దర్శకుడు మన్మోహన్ చెప్పారు.
నిర్మాత నారాయణరావు మాట్లాడుతూ, 'ఈ చిత్ర కథ చాలా బావుటుంది. స్క్రిప్ట్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఉదరు శంకర్‌తో పాటు హీరోయిన్ మేఘా ఆకాశ్ పాత్రలు చాలా బావుంటాయి. మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ జాంబిరెడ్డి ఫేమ్ అనిత్ కుమార్ అందిస్తున్నారు' అని తెలిపారు.