Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని నటించిన తొలి పాన్ ఇండియా ఎంటర్ టైనర్ 'దసరా'. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు.కీర్తి సురేష్ కథా నాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అనంత పురంలో 'దసరా' దూమ్ ధామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, 'ఇన్ని రోజులు మిమ్మ్మల్ని మెప్పించే మాస్ చూసి ఉంటారు. 'దసరా'తో మీ గుండెల్ని హత్తుకునే మాస్ చూపిస్తాను. ఇది నా ప్రామిస్. కళ్ళల్లో చిన్న గ్లిట్టర్‌తో విజిల్స్ వేసే ఆనందం 'దసరా'తో ఎక్స్ పీరియన్స్ చేస్తారు. 'దసరా' నా మనసుకు చాలా దగ్గరైనా సినిమా. ఏడాది కాలం పాటు దమ్ము, ధూళి.. చాలా కష్టాలు పడి టీం అంతా హార్డ్ వర్క్ చేశాం. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌ని నిర్మించిన నిర్మాతలు సుధాకర్, శ్రీకాంత్‌కి కృతజ్ఞతలు' అని అన్నారు. దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ, ''దసరా' లాంటి వండర్పుల్ ప్రాజెక్ట్‌లో నన్ను రిఫర్ చేసిన కో డైరెక్టర్ వినరుకి, దీప్తి మేడమ్‌కి కృతజ్ఞతలు. దర్శకుడు శ్రీకాంత్ నన్ను ఎంతో కంఫర్ట్‌బుల్‌గా చూసుకున్నారు. ఆయన దేశంలోనే టాప్ దర్శకుడిగా ఎదుగుతారు. నానికి ఎప్పుడూ రుణ పడి ఉంటాను. ఇందులో సూరి అనే పాత్ర చేశాను. ఈ పాత్ర నేను బాగా చేశానని మీకు అనిపిస్తే దానికి కారణం కీర్తిసురేషే' అని చెప్పారు.
వెన్నెలగా గుర్తుండిపోతా..
నేను నాని, 'నేను లోకల్' సినిమా చేశాం. కానీ 'దసరా'నే నాకు లోకల్ అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత మీ అందరికీ వెన్నెలగా గుర్తుంటాను. దర్శకుడు శ్రీకాంత్ చాలా కష్టపడి ఈ కథని రాశారు. ఈ కథని ఇంతపెద్ద కాన్వాస్‌పై రూపొందించే అవకాశం ఒక కొత్త దర్శకుడికి ఇచ్చిన మా నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇది అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఫుల్ ప్యాకేజీ.
ఈ నెల 30న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. ఎట్లయితే గట్లయితది చూసుకుందాం.
- కీర్తి సురేష్