Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఆర్సి15కి 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మిస్తోంది. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్రమైజ్డ్గా అంచనాలకు దీటుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సోమవారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భగా ఈ చిత్ర టైటిల్ రివీల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రామ్‌చరణ్ పాన్ ఇండియా ఇమేజ్‌కి తగ్గ టైటిల్‌ను డైరెక్టర్ శంకర్ ఖరారు చేశారని, టైటిల్ రివీల్ వీడియో చూస్తే హీరో క్యారెక్టరైజేషన్ లార్జర్ దేన్ లైఫ్‌గా ట్రాన్స్ఫర్మేటీవ్గా ఉందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలోని రామ్ చరణ్ ఫస్ట్‌లుక్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేసి రామ్‌చరణ్ బర్త్‌డే కానుకగా ఆయన అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఎప్పుడనేది మాత్రం ప్రకటించలేదు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజ్, కో ప్రొడ్యూసర్: హర్షిత్, కెమెరా˜ :ఎస్.తిరుణావుక్కరసు, మ్యూజిక్: తమన్, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల, ఎడిటర్: షామీర్ ముహ్మద్.