Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిల్ రాజు
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక ప్రేమకథా చిత్రం 'శాకుంతలం'. సమంత, దేవ్ మోహన్ జంటగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3డీ టెక్నాలజీతో విజువల్ వండర్‌గా తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. మంగళవారం త్రీడీ ట్రైలర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
ఈ సందర్బంగా నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ, 'ఈ సినిమాను 3డీ టెక్నాలజీలోకి మార్చాలనే ఆలోచన దిల్‌రాజుదే. ఇప్పుడు త్రీడీ ట్రైలర్ చూస్తుంటే ఆయన ఆలోచన ఎంత గొప్పదో అర్థమవుతుంది. మన మైథాలజీని ఇలా త్రీడీలో సినిమా చేయటం ఇదే తొలిసారి అనుకుంటా. ఏప్రిల్ 14 కోసం ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను' అని అన్నారు.
'ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్‌కు చేరుకుంది. తెలుగు సినిమాలను ఇంకా ప్రపంచానికి చూపిస్తూ ఉండాలనే ఉద్దేశంతో నేను వేసిన మొదటి అడుగు 'శాకుంతలం'. బ్యూటీఫుల్ ఫ్యామిలీ డ్రామా.. విజువల్ వండర్‌గా సినిమా తెరెక్కింది. ఓ థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా. ఈ సమ్మర్లో మా సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సినిమా చూసి బయటకొచ్చేటప్పుడు అల్లు అర్హ రూపంలో ఓ సర్ప్రైజ్ ఉంటుంది' అని దిల్‌రాజు చెప్పారు. దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ, ''ఇది సమంత 'శాకుంతలం'. ఆమె ప్రాణం పెట్టి శకుంతల పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని విజువల్‌గా మీ ముందుకు తీసుకొచ్చే క్రమంలో లింకుల కోసం చిన్న చిన్న ఇంప్రవైజేషన్ చేశాం తప్ప.. దాదాపు 90 ఒరిజినల్ కథనే సినిమాగా తీశాం. దిల్‌రాజు ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత. పైగా ఆడియెన్స్ పల్స్ తెలిసిన నిర్మాత. ఆయన్ని వాడుకోవాల్సిన అవసరం మాకు ఉంది. అలాంటి ఆయన్ని వాడుకోకపోతే మా మూర్ఖత్వం అవుతుంది' అని అన్నారు.