Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షర్మన్ జోషి, శ్రియా శరణ్, షాన్, సుహాసిని మూలే, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మ్యూజిక్ స్కూల్'. ఇళయరాజా సంగీత సారథ్యం వహిస్తున్న ఈ మల్టీ లింగ్వువల్ మ్యూజికల్ మూవీ మే 12న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో కలిసి మేకర్స్ ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, 'ప్రస్తుతం పిల్లలపై ఎడ్యూకేషన్ సిస్టమ్ వల్ల ఎంత ప్రెషర్ పడుతుందనేది తెలియజేసే చిత్రమే ఇది. ఇదొక సీరియస్ పాయింట్ కానీ దాన్ని వినోదాత్మకంగా, మ్యూజికల్ ఫిల్మ్‌గా చేశారు పాపారావుగారు. ఇళయరాజా సంగీతం అందించిన 11 పాటలతో ఇదొక మ్యూజికల్ ఎంటర్టైనర్గా అలరించనుంది. ఈ సినిమాను తెలుగులో మేం, మిగతా నేషనల్ వైడ్ పి.వి.ఆర్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు' అని తెలిపారు.
ఐఏఎస్ ఆఫీసర్, సినిమా అంటే ప్యాషన్ ఉన్న పాపారావు బియ్యాల ఈ చిత్రం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన మాట్లాడుతూ, 'పిల్లలపై చదువు పేరుతో ఒత్తిడిని పెంచేస్తున్నారు. దీని వల్ల వారిలో అభివృద్ధి జరగటం లేదు, సరి కదా అదే వారి ఎదుగుదలకు సమస్యగా మారుతోంది అని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా' అని చెప్పారు. యామిని ఫిల్మ్స్ బ్యానర్‌పై హిందీ, తెలుగులో చిత్రీకరించి ఈ చిత్రాన్ని తమిళలో అనువాదం చేశారు.