Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాహనాలు స్వాధీనం
- అపరాధ రుసుం విధింపు
నవతెలంగాణ - అశ్వారావుపేట
అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.మండల కేంద్రం సమీపం లోగల పూసల కుంట నుంచి కొంతమంది వ్యక్తులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి, అనుమతులు లేకుండా నాలుగు ట్రాక్టర్ల తో తరలిస్తుండగా సమాచారం అందుకున్న స్థానిక రెవిన్యూ అధికారులు వాటిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ట్రాక్టర్లను స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అనంతరం పట్టుబడిన ట్రాక్టర్ల కు జరిమానా విధించినట్లు తహసీల్దార్ లూథరన్ విల్సన్ తెలిపారు.