Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్.నారాయణమూర్తి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'యూనివర్సిటీ'. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ జరుపుకుం టున్న సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ, 'మన దేశంలో లక్షలాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశావహ దక్ప థంతో ఉన్నారు. ఎంతో కష్టపడి చదువుతూ, డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఎగ్జామ్ పేపర్ లీకేజీలు అయిపోతూ ఉంటే, వాళ్ళు కన్న కలలు ఏమైపోవాలి?, ఎన్నికల్లో రిగ్గింగ్ చేసినట్టు ప్రశ్నాపత్రాలు లీకేజీ అవుతుంటే విద్యార్థుల భవిష్యత్ ఏమి కావాలి?, లంభకోణం చెప్పేవాడు కుంభకోణం చేసుకు పోతూ ఉంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు గిల గిల లాడి పోతుంటే ఈ విద్య వ్యవస్థకు అర్థం ఎక్కడుంది? ఇలాంటి జరగకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేదే ఈ సినిమా. త్వరలోనే రిలీజ్ చేస్తాం' అని చెప్పారు.