Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరి మధ్య గొడవులు ఉండటంతో, మనోజ్‌కి సంబంధించిన బంధువు ఇంటికెళ్ళి విష్ణు గొడవ చేశాడు. దీన్ని వీడియోగా తీసి మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, మా అన్న విష్ణు ఎప్పుడూ ఇంతే.. ఇళ్ళకి వెళ్ళి గొడవలు పడుతుంటాడు అని పేర్కొన్నాడు. దీంతో మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు తారా స్థాయికి వెళ్ళాయని మీడియా రకరకాల కథనాలను చూపించింది. అయితే ఇదంతా తూచ్.. అని, 'హౌస్ ఆఫ్ మంచుస్' పేరుతో తాము చేస్తున్న రియాలిటీ షోకి సంబంధించిన వీడియో అని మంచు విష్ణు ఇదే సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు వామ్మో.. ఇదేం పబ్లిసిటీరా బాబు.. మంచు ఫ్యామిలీనా మజాకా..' అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.