Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు ఏఆర్.మురుగదాస్ సమర్పణలో గౌతమ్ కార్తిక్ హీరోగా ఎన్.ఎస్ పొన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ సినిమా 'ఆగస్టు 16, 1947'. ఏఆర్.మురుగదాస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, నర్సిరామ్ చౌదరి భారీ బడ్జెట్, అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించిన ఈ చిత్రానికి ఆదిత్య జోషి సహ నిర్మాత.
నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 14న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకుంది.
ఈ సందర్భంగా మురుగదాస్ మాట్లాడుతూ,'ఆగస్టు 16, 1947..ఈ కథ చదువుతున్నపుడు చాలా అద్భుతంగా అనిపించింది. అప్పుడే ఈ సినిమాని నిర్మించాలని నిర్ణయించు కున్నాను. ఇది చాలా స్పెషల్ మూవీ. పీిరియా డిక్ ఫిల్మ్ కూడా. ఆగస్టు 15 దేశ చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. ఆగస్టు 14, 15, 16 ఈ మూడు రోజుల్లో ఓ మారుమూల పల్లెలో జరిగే కథ ఇది. చుట్టూ అడవి కొండ మధ్య వున్న ఊరు. అక్కడికి ఒక వార్త చేరటం కష్టం. ఫ్రీడమ్ అంటే భయాన్ని జయించడం. ఆగస్ట్ 15న ఫ్రీడమ్ వచ్చిందని మనందరికీ తెలుసు. కానీ ఆ ఊరు ఇంకా స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే ఉంటుంది. ఓ బ్రిటిష్ అధికారి ఈ వార్తని ఓ కారణం చేత వారికి తెలియకుండా దాచిపెడతాడు. వ్యక్తిగతంగా వారికి ఆగస్ట్ 16న స్వాతంత్య్రం పొందుతారు. ఆగస్ట్ 16న ఏం జరిగిందనేది చాలా ఉత్కంఠ భరితంగా ఉంటుంది. యాక్షన్, ఎమోషన్స్, లవ్, హ్యుమర్ ఇవన్నీ కలిసిన ఒక అందమైన కథ. ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని చెప్పారు. 'నా మనసుకు చాలా దగ్గరైన సినిమా ఇది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగం చేసిన మురుగ దాస్‌కి కృతజ్ఞతలు' అని హీరో గౌతమ్ కార్తిక్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, 'గతవారం విడుదలైన ట్రైలర్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 14న సినిమాని థియేటర్లో చూసి ఆదరించండి' అని తెలిపారు.
ప్రాథమిక దశలోనే ఉంది..
రజనీకాంత్‌తో చేసిన 'దర్బార్' తర్వాత మురుగదాస్ ఇప్పటి వరకు ఏ చిత్రానికీ దర్శకత్వం వహించలేదు. అయితే అల్లుఅర్జున్‌తో సినిమా ఉంటుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అవి నిజమా కాదా అని మురుగదాస్ శనివారం మీడియాకి క్లారిటీ ఇచ్చారు. అల్లుఅర్జున్‌తో సినిమా ఉంటుంది. అయితే అది ఇప్పుడు ప్రాథమిక దశలో మాత్రమే. దీని గురించి ఎక్కువ చెప్పే అవకాశం ఇప్పుడు లేదు అని తెలిపారు.