Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా అంటే ఎన్నో రకాలు పాత్రలు, ఎన్నో విభిన్న కారెక్టర్లుంటాయి. అలా ఉంటేనే సినిమాను ప్రేక్షకులు ఎంజారు చేస్తారని, రెండున్నర గంటలు ఎంటర్టైన్ చేయవచ్చు అని అంతా అనుకుంటారు. కానీ పరిమితమైన పాత్రలతోనూ అద్భుతాలు చేయవచ్చని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితమైంది. ఇదే కోవలో ఇప్పుడు తెలుగులో మరో ప్రయత్నంగా గార్గేయి యల్లాప్రగడ ప్రధాన పాత్రలో 'హలో మీరా' అనే సినిమా రాబోతోంది. ఒకే ఒక పాత్రతో సినిమాను తెరకెక్కించడం సాహసమనే చెప్పాలి. ఆ సాహసాన్ని 'హలో మీరా' అంటూ ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు. ప్రముఖ దర్శకులు బాపుతో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవంతో ఆయన ఈ సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.
లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో, డా. లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం, ఎక్కడా ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా చిత్రీకరించడంపై సెన్సార్ బృందం ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను ఏప్రిల్ 21న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఇకపై మరింత భిన్నంగా ప్రమోషన్ కార్యక్రమాలు పెంచబోతున్నట్టుగా నిర్మాతలు తెలిపారు.
'నాయిక గార్గేయి యల్లా ప్రగడ నటన, ప్రశాంత్ కొప్పినీడి విజువల్స్, చిన్న సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఇక దర్శకుడు శ్రీనివాసుకాకర్లకు ఈ సినిమాతో మంచి పేరు లభిస్తుంది. అంతేకాకుండా ఆయనకి మరిన్ని అవకాశాలూ వస్తాయి' అని నిర్మాతలు అన్నారు. ఈచిత్రానికి మాటలు : హిరణ్మయి కళ్యాణ్, ఎడిటర్: రాంబాబు మేడికొండ, పాటలు: శ్రీ సాయి కిరణ్, సింగర్స్: సమీరా భరద్వాజ్, దీపక్ బ్లూ, ఆడియోగ్రఫీ: ఎం.గీత గురప్ప.