Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిసాయి. అమ్మవారికి సమర్పించిన బోనాలు ముదిరాజ్ సంఘ సభ్యులు ఇంటికి తీసుకువచ్చి బంధుమిత్రులతో కలిసి పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ పార్టీ అధ్యక్షుడు గెరిగంటి నర్సింలు ఇంటికి వెంకటరమణారెడ్డి వెళ్లి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.