Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ నటిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రావణాసుర'. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మించారు.
ఈనెల 7న సమ్మర్ స్పెషల్‌గా ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రీరిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ, 'మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ ప్రతి సెట్ చాలా అద్బుతంగా వేశారు. డివోపీ విజరు కన్నన్ ఎక్స్ టార్డినరీగా చేశారు. రెండు పాటలు చేసిన జికే విష్ణు, దివాకర్ మణి, ప్రసాద్ మురెళ్ళకి థ్యాంక్స్. వెంకట్, శివ ఫైట్స్ ఇరగదీశారు. మా డ్యాన్స్ మాస్టర్ శేఖర్ ఎక్స్‌లెంట్‌గా చేశారు. ఈ సినిమా మ్యూజిక్‌కి స్పెషల్ ఎప్పియరెన్స్ భీమ్స్. నాకు ఇష్టమైన టెక్నిషియన్. ఈ సినిమాకి హర్ష వర్ధన్.. అద్భుతమైన సౌండ్ ఇచ్చాడు. మీ అందరూ ఎంజారు చేస్తారు. రైటర్ శ్రీకాంత్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్‌కి వెళ్ళాలి. తనతో 'టైగర్ నాగేశ్వరరావు' చేస్తున్నాను. మేఘా, దక్ష, పూజిత, అను, ఫరియా... హీరోయిన్స్ అంతా పర్ఫెక్ట్గా చేశారు. ఆదితో నాకు మంచి టైమింగ్ కుదిరింది. మా ఎడిటర్ నవీన్ నూలి.. ఈ సినిమా గురించి చాలా బాగా చెప్పాడు. చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమా అందరినీ ఎంతగానో అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఏప్రిల్ 7న విజల్స్ పడతాయి. ఈ సినిమా చాలా బావుంటుంది. నిర్మాతలుగా నాకు, అభిషేక్‌కి మంచి కాంబినేషన్ ఏర్పడుతుందని భావిస్తున్నాను. సుశాంత్ చాలా సాఫ్ట్ పర్సన్. ఈ సినిమాలో తనది ఎక్స్లెంట్ క్యారెక్టర్. చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమాతో కొత్త సుశాంత్‌ని చూడబోతున్నారు. సుధీర్ వర్మ నాకు ఇష్టమైన డైరెక్టర్. ఈ సినిమాతో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. థియేటర్స్‌లో ఇరగదీసేద్దాం. మాములుగా ఉండదు. సౌండ్ దద్దరిల్లుతుంది' అని తెలిపారు.
'మాస్ మహారాజాని ఎప్పుడూ ఇలా చూసి ఉండరు. సుధీర్ అద్భుతమైన డైరెక్టర్. రవితేజతో పని చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్' అని సుశాంత్ చెప్పారు.
దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ,'ఈ సినిమాలో థ్రిల్ అవుతారు, షాక్ అవుతారు. ఇందులో సుశాంత్ మరో సర్ప్రైజ్. ఆయన్ని కొత్తగా చూపించానని భావిస్తున్నాను. శ్రీకాంత్ అద్భుతమైన కథ ఇచ్చారు. రవితేజ గురించి ఎంత చెప్పినా తక్కువే' అని అన్నారు.
నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ,'ఈ వేడుక చూస్తుంటే 50 రోజుల పండగలా వుంది. ఈనెల 7 తర్వాత .. ఇక్కడే యాభై రోజుల పండగ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం' అని అన్నారు.