Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బేబీ'.మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి గతంలో విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి సెకండ్ రిలికల్ సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. మొదటి పాటకు పూర్తి భిన్నంగా ఉంటూనే, వైవిధ్యమైన టోన్‌లో మరో అద్భుతమైన పాటలా కనిపిస్తోంది. ఈ పాటను మలయాళంలో మోస్ట్ ఫేమస్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న ఆర్య దయాళ్ పాడారు. అంతే కాదు.. ఓ పెద్ద బడ్జెట్ సినిమా రేంజ్లో భారీ సెట్స్ వేసి మరీ ఈ గీతాన్ని వీడియోగానూ చిత్రీకరించారు. ఈ పాటలో ఆర్యదయాళ్ స్వయంగా యాక్ట్ చేయడం విశేషం.
విజరు బుల్గానిన్ స్వరపరిన ఈ గీతాన్ని త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి రాశారు. సంస్కృత పదాలతో మొదలైన పాట ఆసాంతం కట్టిపడేశాలా సాహిత్యం, కంపోజింగ్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతం నుంచి నగరంలోని పెద్ద కాలేజ్‌కు చదువుకోవడానికి వెళ్లిన ఓ అమ్మాయికి కనిపించే కొత్త ప్రపంచం అంతా నిజం కాదనీ.. 'నిజమనుకునే క్రీనీడలే అడుగడుగునా ఉంటాయనీ.. తెలుపదు కదా ఓ పాఠమై చదువే.. భ్రమల మైకాన భ్రమణమే చేసి భ్రమరమవుతుంది కాలమే'.. అనే అద్భుతమైన సాహితీ విలువలున్న ఈ గీతం మాంటేజ్ పాటలా ఉంది. మొదటి పాటకు వచ్చిన రెస్పాన్స్ తర్వాత కథను ముందుకు నడిపించేలా ఉన్న ఈ గీతం కూడా 'బేబీ'పై అంచనాలు పెంచేలా ఉంది. మ్యూజికల్‌గా ఈ సినిమా మరో సంచలనం కాబోతోందని రెండో పాట కూడా చూసిన తర్వాత అర్థం అవుతోంది. 'హృదయ కాలేయం', 'కలర్ ఫోటో', 'కొబ్బరిమట్ట' చిత్రాల దర్శకుడు సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఆనంద్ దేవరకొండకి మంచి పేరు తీసుకొస్తుంది. ఆయన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. నాగబాబు, లిరీష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీ: ఎమ్ఎన్ బాల్ రెడ్డి, కో ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని.