Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ తాజాగా నటించిన చిత్రం 'రావణాసుర'. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఈనెల 7న సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సుధీర్ వర్మ మీడియాతో సంభాషించారు. 'రచయిత శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు రవితేజకి నచ్చి, దర్శకుడిగా నేనైతే బావుంటుదని నా దగ్గరికి పంపించారు. కథ విన్నప్పుడు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇలాంటి థ్రిల్లర్‌ని ఓ పెద్ద హీరో చేయడం ఇంకా ఎగ్జైటెడ్‌గా ఫీల్ అయ్యాను. 'రావణాసుర' వంద శాతం కొత్త జోనర్ మూవీ. ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమాలో థ్రిల్స్, షాకింగ్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణ. అందులో ఏది రివీల్ చేసినా సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్ ఉండదు. ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వడానికే వాటి గురించి మేం ఇప్పటివరకు ఎక్కడా ప్రస్తావించలేదు. ఇందులో హీరోది గ్రే షేడ్ క్యారెక్టర్. అయితే గ్రే షేడ్స్ అనేది చాలా కాలంగా ఉంది. ఈమధ్య 'పుష్ప, కేజీఎఫ్..' చిత్రాలతో మరింత పాపులర్ అయ్యింది. ఇందులో చాలా మంది నటీనటులు ఉన్నారు. అయితే కథలో ఇంతమంది ఉన్నారు .. ఏం చేస్తారు? అనే క్యురియాసిటీనే కావాలి. ప్రతి పాత్ర కీలకంగా కథలో భాగంగా ఉంటుంది. సర్ప్రైజ్, షాక్, థ్రిల్.. ఈ మూడు ఎలిమెంట్స్‌తో అలరించే చిత్రమిది. రవితేజ పెర్ఫార్మన్స్ గురించి మనందరికీ తెలుసు. నా విజన్‌కి బెటర్‌గానే ఆయన పెర్ఫార్మన్స్ చేస్తారు. ఇది కంప్లీట్ రవితేజ సినిమా. పెర్ఫార్మన్స్ వారీగా ఆయన సినిమాల్లో టాప్3లో ఉంటుంది. అలాగే ఈ సినిమా మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. సినిమా ప్రారంభంలోనే హర్షవర్ధన్‌తో నేపథ్య సంగీతం, భీమ్స్‌తో పాటలు చేయించాలని అనుకున్నాం. నిర్మాత అభిషేక్‌తో నాకు ఇది రెండో సినిమా. నేను ఉన్నంత వరకూ ఆయన అన్ని వదిలేస్తారు. 'సుధీర్ ఏం అడిగితే అది ఇచ్చేయండి' అని చెప్తారు. థ్రిల్లర్స్‌కి యూనివర్సల్ రీచ్ ఉంటుందని తొలుత ఈ సినిమాని అన్ని భాషల్లో విడుదల చేయాలనుకున్నాం. ఇందులో భాగంగా సెకండ్ వీక్ నుంచి హిందీలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం. నాకు థ్రిల్లర్స్ అంటే బాగా ఇష్టం. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. నెక్ట్స్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్‌తో ఉంటుంది. దీనికి త్రివిక్రమ్ కథ అందిస్తున్నారు. దీని గురించి త్వరలోనే తెలియజేస్తాను' అని తెలిపారు.