Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన చిత్రం 'మీటర్'. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. అతుల్య రవి కథానాయిక. సమ్మర్ స్పెషల్‌గా ఈనెల 7న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత చెర్రీ 'మీటర్' విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు. 'గోపీచంద్‌తో 'ఒక్కడున్నాడు', 'మత్తు వదలరా', 'హ్యాపీ బర్త్ డే' వంటి ప్రయోగాత్మక చిత్రాలు చేశాను. తొలిసారి కమర్షియల్ ఫార్మెట్లోకి వెళ్తే బావుటుందని ఈ సినిమా చేశాం. కమర్షియల్ ఎంటర్టైనర్ అంటే సాంగ్స్, ఫైట్స్, కామెడీ అన్నీ ఉన్నప్పటికీ బలమైన కథ కూడా ఉండాలి. అలాంటి బలమైన కథ ఉన్న సినిమా ఇది. దర్శకుడు రమేష్ చాలా మంచి కథతో ఈ సినిమా చేశారు. కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మంచి కథని ప్రయోగాత్మకంగా చెప్పొచ్చు, కమర్షియల్గానూ ప్రజెంట్ చేయవచ్చు, బాబీ, గోపీచంద్ మలినేని దగ్గర దర్శకుడు రమేష్ పని చేశారు. కాబట్టి ఆ స్టయిల్ ఆఫ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. దర్శకుడు ఈ కథ చేసుకుని వచ్చినపుడు పెద్ద హీరోతో చేద్దామని అనుకున్నారు. అయితే కుదరలేదు. టీజర్, ట్రైలర్ చూసినప్పుడు పెద్ద హీరోతో చేసే కథ అని అందరూ అనటం ఆనందంగా ఉంది. హీరో కిరణ్ అబ్బవరం ఏ పాత్రనైనా చేసే ఈజ్ ఉన్న నటుడు.ఈ పాత్ర ఆయనకి సరిగ్గా నప్పింది. మేనరిజం, ఎనర్జీ, స్టయిల్.. ఇలా దర్శకుడు ఏం అనుకున్నాడో దాన్ని కిరణ్ అద్భుతంగా చేశాడు. ఈ సినిమాని మైత్రి మూవీస్‌తో కలిసి చేయటం ఆనందంగా ఉంది. ప్రస్తుతం రితేష్ రానాతో ఒక ప్రాజెక్ట్, అలాగే ఓ కొత్త దర్శకుడితో మరో సినిమా నిర్మించే పనిలో ఉన్నాను' అని తెలిపారు.