Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ నటించిన తాజా చిత్రం 'రావణాసుర'. సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్‌గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఈనెల 7న సమ్మర్ స్పెషల్‌గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో నిర్మాత అభిషేక్ నామా 'రావణాసుర' చిత్ర విశేషాలని మీడియాతో షేర్ చేసుకున్నారు. 'శ్రీకాంత్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌గా ఫీల్ అయ్యాను. ఇంతవరకూ రవితేజ ఇలాంటి సినిమా చేయలేదు. ఈ సినిమా చూసిన తర్వాత రవితేజ ఇలా కూడా చేయగలుగుతారా? అని ప్రేక్షకులు షాక్ అవుతారు. కొత్త కాన్సెప్ట్. ఇది వర్క్ అవుట్ అయితే హీరోలు ఇలాంటి మరిన్ని కథలు ప్రయత్నిస్తారు. రవితేజని ఇంత కొత్త కోణంలో చూసే సరికి అదిరిపోయింది కదా అనే ఫ్యాక్టర్ వస్తుంది. ఇంటర్వెల్ ఎక్స్టార్డినరీగా ఉంటూ ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక ఇన్నోసెంట్ ఫేస్‌తో ఫ్రెష్‌గా ఉండాలని సుశాంత్‌ని ఎంపిక చేశాం. ఇందులో సుశాంత్‌ని కూడా చాలా కొత్తగా చూస్తారు. సుధీర్ వర్మతో చేసిన 'కేశవ' నిర్మాతగా నాకు కమర్షియల్‌గా వర్క్ అవుట్ అయ్యింది. కానీ బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది. ఈ సినిమాతో 100% బ్లాక్ బస్టర్ హిట్ కొడతాం. ఇప్పటికే 'రావణాసుర' మ్యూజిక్ హిట్ అయ్యింది. ప్రేమ విమానం, డెవిల్, డెవిల్ 2 కూడా ఉంది. మొత్తమ్మీద వచ్చే ఏడాదిలో దాదాపుగా ఏడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని తెలిపారు.