Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గబ్బర్ సింగ్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్‌కి జోడీగా శ్రీలీల నాయికగా నటించనుంది. గత డిసెంబర్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి రూపొందించిన అద్భుతమైన పోలీస్ స్టేషన్ సెట్లో మొదటి షెడ్యూల్ జరగనుంది. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనుకోనున్న ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొననున్నారు.'గబ్బర్ సింగ్'కి మించి,ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ చిత్రాన్ని అందించాలని దర్శకుడు హరీష్ శంకర్ పట్టుదలగా ఉన్నారు. ఈ చిత్రం కోసం అత్యుత్తమ సాంకేతిక బందం పని చేస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.