Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై వస్తోన్న తాజా చిత్రం 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో'. ఇచ్చట అందమైన ఫోటోస్ తీయబడును అనేది ఉపశీర్షిక. చైతన్య రావు, లావణ్య జంటగా నటిస్తున్నారు.
ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి లిరికల్ సాంగ్‌ను నటుడు ప్రియదర్శి చేతుల మీదుగా యూనిట్ విడుదల చేసింది. కథా నేపథ్యాన్ని బట్టి 80ల నాటి రెట్రో మ్యూజిక్‌ను గుర్తు చేసేలా కంపోజింగ్, ట్యూన్ ఉన్నాయి.
ఎస్పీ బాలుని గుర్తుకు తెచ్చేలా ఆయన తనయుడు చరణ్ అద్భుతంగా ఈ పాటను పాడారు. 'కంటిచూపు నిన్నే దాటి పోనంటోందమ్మా..గుండె కాజేసి జెడ గంటె కట్టావమ్మా.. రంగమ్మా' అంటూ ఈ లిరిక్స్ కాస్త ఫన్నీగా ఉన్నా.. రెట్రో స్టైల్ పిక్చరైజేషన్తో చాలా ఎట్రాక్టీవ్‌గా ఉంది.
'ఈ 'రంగమ్మ..' పాట నాకు చాలా ఫేవరెట్ సాంగ్.చాలా మంది ఈ పాటతో ప్రేమలో పడిపోయాం' అని హీరో చైతన్య రావు అన్నారు.
'బీట్ పరంగా ఎనభైల్లోని ఆర్డీ బర్మన్, బప్పీలహిరి తరహా రిథమ్ కనిపిస్తుంది. సినిమాలో చాలా ఇంపార్టెంట్ టైమ్‌లో ఈ పాట వస్తుంది' అని నిర్మాత అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, 'ప్రిన్స్ హెన్రీ ఈ పాటకి ఇచ్చిన సౌండింగ్ కొత్తగా ఉంటుంది. ఈ పాట మాస్‌తో పాటు పబ్బుల్లో కూడా మెగుతుంది. షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే రిలీజ్ చేస్తాం' అని తెలిపారు.