Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కార్తికేయ2' తర్వాత నిఖిల్ పాన్-ఇండియన్ చిత్రం 'స్పై'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'కార్తికేయ 2'లాగానే 'స్పై' కూడా యూనివర్సల్ అప్పీల్, యూనిక్ పాయింట్‌తో బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని చరణ్‌తేజ్ ఉప్పలపాటి సిఇఓగా ఈడీ ఎంటర్టైన్్మెంట్స్పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి. అమెజాన్, స్టార్ నెట్వర్క్ కలిసి ఈ చిత్రం పూర్తి నాన్-థియేట్రికల్ హక్కులను రూ.40 కోట్లకు పొందడం విశేషం. ఐశ్వర్యా మీనన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ ఓ ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు.