Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణా గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్టార్టప్ కంపెనీలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో ప్రారంభించిన కేంద్రం టీహబ్. శుక్రవారం హైదరాబాద్‌లోని టీహబ్‌లో సినీప్రెన్యూర్ గ్రాడ్యుయేషన్ సెర్మనీ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణా జయేష్ రంజన్, టీహబ్ సీఈవో యం.శ్రీనివాస రావు, తెలంగాణా ఎఫ్.డి.సి చైర్మెన్ అనిల్ కూర్మాచలం, తెలుగు సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బసిరెడ్డి, మీస్కూల్ సినీప్రెన్యూర్ ఫౌండర్ డైరెక్టర్ ప్రతిభ పులిజల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ మాట్లాడుతూ,'టీహబ్‌లో స్టార్టయిన సినిమా స్టార్టప్ కంపెనీ సినీ ప్రెన్యూర్. నిష్ణాతులైన వారి ఆధ్యర్వంలో ఈ కోర్స్‌ను పూర్తిచేసిన 11మంది గ్రాడ్యుయేట్స్‌కు జయేష్ రంజన్ సర్టిఫికెట్స్ ప్రదానం చేయటం ఆనందంగా ఉంది' అని అన్నారు. 'ప్రభుత్వం తరఫున క్రియేటివ్‌గా పనిచేసే వారందరికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది' అని జయేష్ రంజన్ అన్నారు. టీహబ్ సీఈవో మాట్లాడుతూ,'టీహబ్ ద్వారా త్వరలోనే సినిమా పరిశ్రమకు చెందిన అనేక శాఖలకు గవర్నమెంట్ ద్వారా లక్ష యాభైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రీన్‌మ్యాట్, విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన స్టూడియోను రూపొందిస్తున్నాం' అని తెలిపారు. ఆర్పీ.పట్నాయక్ మాట్లాడుతూ,'తెలంగాణా ప్రభుత్వం నంది అవార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలి' అని చెప్పారు.