Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం 'పుష్ప'. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'పుష్ప: ది రూల్'ని మైత్రీ మూవీస్ అసోసియేషన్‌తో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యల మంచిలి నిర్మిస్తున్నారు. నేడు(శనివారం) అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి 'హంట్ ఫర్ పుష్ప' అనే కాన్సెప్ట్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. 'పుష్ప ఏమి చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో చెబుతున్నారు. కానీ, సంపాదించిన దుడ్డు ఏమి చేస్తున్నాడో చెబుతున్నారా? లాంటి డైలాగ్స్ పుష్పలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తే, అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కు వేశాయంటే పులి వచ్చిందని అర్థం, అదే పులి రెండు అడుగులు వెనక్కు వేసిందంటే పుష్ప వచ్చుండాడు అని అర్థం' అనే డైలాగ్‌తో పుష్ప క్యారెక్టర్ రేంజ్‌ని మరింత పెంచాయి.