Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా రిలీజైన రోజు ఇంట్లోనే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే ఛాన్స్ ఏపీ ఫైబర్ నెట్ కల్పిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు 'ప్రజల వద్దకు సినిమా' తీసుకువస్తున్నామని, మారుమూల గ్రామాల్లో ఉన్నవారు కూడా రిలీజ్ రోజే సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నాం' అని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నెట్ సేవలను ఏపీలో తక్కువ ధరకు అందిస్తున్నాం. పెద్ద హీరోలకు, నిర్మాతలకు మేము వ్యతిరేకం కాదు. సినిమాను బేస్ చేసుకుని ఫిఫ్టీ-ఫిఫ్టీ రేషియో ఉంటుంది. ఏపీఎస్ఎఫ్ఎల్ పల్లెటూర్లతో ఎక్కువ కనెక్ట్ అయింది. దీనివల్ల మారుమూల గ్రామాల్లో ఉన్న వారు కూడా రిలీజ్ రోజు సినిమా చూసే అవకాశం పుష్కలంగా ఉంటుంది' అని చెప్పారు.
'ఏ రోజు సినిమా రిలీజ్ అవుతుందో.. అదే రోజు పల్లెటూరులో కూడా సినిమా చూడవచ్చనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. చిరంజీవి లాంటి పెద్ద హీరో సినిమా కూడా ఫైబర్ నెట్లో రిలీజ్ అయితే ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది' అని ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు.
ఏపీ ఎలక్రానిక్ మీడియా అడ్వైజర్, నటుడు అలీ మాట్లాడుతూ, 'ఒక నిర్మాత కష్టపడి సినిమా తీస్తే అది రిలీజ్ రోజునే పైరసీ అయిపోతుంది. ఇండిస్టీలో ఉన్న మనం పైరసీని ఎందుకు అరికట్టలేకపోతున్నాము?, పెద్దలందరూ కూడా దీనిపై పోరాడాలి. ఫైబర్ నెట్లో రిలీజ్ రోజున సినిమా చూడడం అనేది చిన్న సినిమాకు ఆక్సిజన్ లాంటిది. చిన్న నిర్మాతలు ఫైబర్ నెట్లో కచ్చితంగా రిలీజ్ చేస్తారు. పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వస్తారని అనుకుంటున్నాను' అని అన్నారు.
నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ,'ఏపీ ప్రభుత్వం నియమించిన పోసాని, అలీ, జోగినాయుడు వల్ల సినిమా ఇండిస్టీకి మంచి జరుగుతోంది. ఫైబర్ నెట్లో సినిమా రిలీజ్ అనేది చిన్న నిర్మాతకు జగన్ గారిచ్చిన వరం. చిన్న సినిమాకు అసలు థియేటర్స్ ఇవ్వడం లేదు. జనాలు ఓటీటీకి అలవాటు పడ్డారు. ఈరోజు చిన్న నిర్మాతలకు పేదల పాలిట పెన్నిదే ఈ ప్లాట్ఫామ్. ఏపీ సీఎం జగన్ విజన్ చాలా పెద్దది. సినిమా ఇండిస్టీ అభివృద్ధి కోసం మంచి ఆలోచన చేశారు. చిన్న నిర్మాతలకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు సినీ ఇండిస్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిర్మాతలు సైతం దీన్ని వినియోగించుకోవాలి' అన్నారు.