Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంకయ్యనాయుడు
రచయిత సంజయ్ కిషోర్ సేకరించి రచించి రూపకల్పన చేసిన 'స్వాతంత్రోద్యమం - తెలుగు సినిమా - ప్రముఖులు' పుస్తకావిష్కర ణోత్సవం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్లో అతిరథ మహారథుల సమక్షంలో శనివారం ఉదయం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుస్తకాన్ని విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ,'తెలుగు సినిమా పరిశ్రమ స్వాతంత్య్రం రాకముందు నుండి ఉన్నది. అందుకే ఈ పుస్తక రచయిత సంజయ్ కిశోర్ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తెలుగు సినిమా ప్రముఖులు, అప్పటి పరిస్థితులు, సినిమాల గురించిన చక్కటి విశ్లేషణ చేశాడు. ఇలాంటి పుస్తకాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. ఒకప్పుడు ఒక సభ నిర్వహిస్తున్నామంటే ఎక్కడెక్కడి నుండో ప్రజలు పాల్గొనేవారు. ఇప్పుడు ఏ సభ అయినా నిర్వహిస్తే మూడు బీలు సమకూర్చాలి అంటున్నారు. మూడు బీ-లంటే 'బస్సు- బిర్యానీ- బాటిల్'. ఈ మూడు ఉంటేనే సమావేశాలకు హాజరవుతున్నారు. ఇవన్నీ వింటుంటే మనదేశం ఎక్కడికిపోతుంది అని భాదేస్తుంది. గూగుల్‌ను రిపేర్ చేయాలన్నా గురువే కావాలి. అదీ గురువు గొప్పతనం. ఇటువంటి మంచి పుస్తకాన్ని వీడియో రూపంలో తీసుకురావటానికి సంజయ్ కిశోర్‌ని ప్రయత్నించమని కోరుతున్నా' అని అన్నారు.
'కె.వి.రమణాచారి గారు ఆజాదికా అమృత్ మహౌత్సవ్ గురించి చెప్పి.. నువ్వూ ఏదైనా చెరు అన్నారు. దీంతో స్వాతంత్య్రంలో పాల్గొన్న మన సినిమా పెద్దల గురించి రాద్దామని అనుకుని ఈ పుస్తక ప్రయాణం మొదలు పెట్టాను. నేను ఏ కార్యక్రమం చేసినా నన్ను నమ్మి ముందుకు వచ్చే కిమ్స్ అధినేత బొల్లినేని కృష్ణయ్య, సదరన్ ఇంజనీరింగ్ కంపెనీ అధినేత రాజశేఖర్ సాయం చేశారు. ఈ పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించడం హ్యాపీగా ఉంది' అని పుస్తక రచయిత సంజయ్ కిశోర్ చెప్పారు. పుస్తక తొలిప్రతిని శ్రీకర ఆర్గానిక్స్ రాజు లక్షా వెయ్యి నూటవరహారు రూపాయాలకు కొనుగోలు చేశారు.