Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రభుత్వం సహకారంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 'టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా- 2023' వేడుకలు దుబాయ్‌లో ఘనంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ సందర్బంగా దీని బ్రోచర్‌ను సోమవారం ఫిలించాంబర్‌లో రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్‌ని మళ్లీ ప్రతాని రామకృష్ణ ప్రభుత్వ సహకారంతో ఇవ్వడం సంతోషకరం. అయితే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీసే చిత్రాలకు స్పెషల్‌గా నంది అవార్డ్ కేటాయిస్తే బావుంటుంది. అలాగే తెలంగాణలో అద్భుతమైన టూరింగ్ స్పార్ట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని 90 శాతం అక్కడే షూటింగ్ చేసే సినిమాలకు నంది అవార్డ్స్ తో పాటు నగదు ప్రోత్సాహకాలిస్తే మరిన్ని చిత్రాలు రూపొందడంతో పాటు తెలంగాణలో టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది' అని అన్నారు.
'ఈ అవార్డ్స్‌కి ప్రభుత్వం నుంచి కచ్చితంగా మంచి సపోర్ట్ లభిస్తుంది. తప్పకుండా ఈ వేడుకని గ్రాండ్ సక్సెస్ చేస్తాం. అలాగే విజయేంద్రప్రసాద్ చెప్పిన విషయాన్ని కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం' అని టియస్ ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు .డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, 'దుబారులో జరిగే ఈ వేడుకలో దుబారు ప్రిన్స్ చేతుల మీదుగా అవార్డులు ఇవ్వనున్నాం. పరిశ్రమ ప్రముఖులతో కూడిన జ్యూరీ ఎంపిక చేసిన విజేతలకు అవార్డులను అందజేస్తాం. 2021- 22 సంవత్సరంలో విడుదలైన చిత్రాల వాళ్లు అప్లరు చేసుకోవచ్చు' అని తెలిపారు.