Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బలగం సినిమాలో తన పాటతో కోట్లాదిమంది హృదయాలను కదిలించిన మొగిలయ్య ఆరోగ్యం మంగళవారం మరింతగా క్షీణించింది. ఇప్పటికే రెండు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్న మొగిలయ్య.. అస్వస్ధతకు గురవడంతో వరంగల్ నగరంలోని సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలంటూ వైద్యులు సూచించడంతో.. విషయం తెలిసిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సంరక్ష హాస్పిటల్‌కు చేరుకొని మొగిలయ్యను పరామర్శించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని తెలిపారు. నేడు మొగిలయ్య ఆరోగ్య స్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం కోసం కిమ్స్‌కు తరలించినట్టు తెలిపారు. కాగా ఎమ్మెల్యే నరేందర్ మొగులయ్యకు అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే వెంట సంరక్ష హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పోలా నటరాజ్, తదితరులు ఉన్నారు.