Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రుద్రమదేవి'కి నేనే సోలో నిర్మాత. ఆ సినిమాని ఎలాంటి లెక్కలూ వేసుకోకుండా తీశాను. 'శాకుంతలం' కూడా అంతే. కథని నమ్మి తెరకెక్కించిన చిత్రమిది' అని దర్శకుడు గుణశేఖర్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శాకుంతలం'. సమంత కథానాయిక. నీలిమ గుణ నిర్మాత. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 14న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సమంత మాట్లాడుతూ, 'నా కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా ఇది. మూడు భాషల్లోనూ నేనే డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా కోసం ఎలాంటి రిఫరెన్సులూ చూడలేదు. గుణశేఖర్ మనసులో ఈ పాత్ర ఎలా ఉండాలో స్పష్టంగా ఉంది. దాన్ని నేను ఫాలో అయిపోయాను. చిన్నప్పుడు త్రీడీ సినిమాలు చూసి థ్రిల్ ఫీలయ్యేదాన్ని. ఇప్పుడు నా సినిమా త్రీడీలో రావడం ఆనందాన్ని కలిగిస్తోంది. త్రీడీ ఎఫెక్ట్స్ చిన్నపిల్లలకు బాగా నచ్చుతాయి' అని తెలిపారు. 'స్టార్ హీరోల సినిమాలకు థియేటర్లు ఎలాగూ నిండిపోతాయి. కానీ ఓ మంచి సినిమా తీసినప్పుడు మాత్రం ప్రణాళికాబద్ధంగా ప్రమోషన్లు చేసుకోవాలి.
ఈ సినిమాకి అదే చేస్తున్నాం. టికెట్ రేట్లు కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉంచేలా ప్రయత్నిస్తున్నాం' అని దిల్‌రాజు చెప్పారు.
కుందేలు కరిచింది..
నాకు పూలు అంటే ఎలర్జీ. ఈ సినిమా కోసం తప్పనిసరిగా వాడాల్సి రావడంతో దద్దుర్లు వచ్చాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పా. దీంతో నిద్రలో కూడా డైలాగ్స్‌ని కలవరించా. సెట్లో చాలా కుందేళ్ళు ఉండేవి. వాటిల్లో ఒకటి నన్ను కరిచింది. ఒక పాటలో వేసుకున్న 30కేజీల బరువు ఉన్న లెహంగా నాకు, కెమెరామెన్‌కి చిచ్చు పెట్టింది (నవ్వుతూ). ఈ సినిమాలో కనిపించే జుట్టు నాది కాదు.. అలాగని అది ఒరిజినలూ కాదు అని సమంత సరదాగా షేర్ చేశారు.