Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్ హీరో, హీరోయిన్లుగా ఎటిర్నిటి ఎంటర్టైన్మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై నటించిన చిత్రం 'ఓ కల'. దీపక్ కొలిపాక దర్శకత్వంలో లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేటి (గురువారం) నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ కొలిపాక మాట్లాడుతూ,'ఇదొక సోషియో లవ్ డ్రామా. ఈ చిత్రంలోని సన్నివేశాలు చాలా మంది నిజ జీవితాలకు దగ్గరగా ఉంటాయి. ప్రతిఒక్కరికీ ఈ చిత్రం గుర్తుండి పోతుంది. ఇలాంటి కథతో ఈ మధ్యకాలంలో ఏ సినిమా రాలేదు. ఇది తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని తెలిపారు. 'నిర్మాతగా ఇది నా మొదటి చిత్రం. రెండవ చిత్రం కూడా షూటింగ్ పూర్తయి, విడుదలకి సిద్ధంగా ఉంది. ఓ మంచి కథతో ఈ సినిమా చేశాం. సినిమా అవుట్‌ఫుట్ బాగా వచ్చింది' అని నిర్మాత మహేష్ అన్నారు.
హీరో గౌరీష్ మాట్లాడుతూ, 'చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరూ ఎంజారు చేసే చిత్రమిది. అందరూ మా సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. 'ఇదొక గొప్ప రైడ్ లాంటి చిత్రం. నేను షూటింగ్ సమయంలో ఎంతగా ఆనందపడ్డానో సినిమా చూసేటప్పుడు మీరు కూడా అంతే ఎంజారు చేస్తారు' అని హీరోయిన్ రోషిణి చెప్పారు.