Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బిచ్చగాడు'తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు హీరో విజయ్ ఆంటోనీ. తెలుగులోనూ ఈ చిత్రం చాలా పెద్ద విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా స్వీయ దర్శకత్వంలో 'బిచ్చగాడు-2'తో ఆయన త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
'చెల్లి వినవే.. నా తల్లీ వినవే.. నీ అన్నను కానూ అమ్మను నేను.. చిట్టీ వినవే.. నా బుజ్జీ కనవే.. నీ పుట్టూ మచ్చై ఉంటా తోడూ' అంటూ సాగే ఈ గీతాన్ని భాష్య శ్రీ రాయగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సంగీతం విజయ్ ఆంటోనీ అందించారు. అనాథలైన హీరో, అతని సోదరి చిన్నతనంలో అనుభవించిన కష్టాలు, సమస్యల నేపథ్యంలో సాగిన ఈ పాట సినిమాలో హైలెట్ సాంగ్లానూ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరినీ కదిలించేలా పూర్తి ఎమోషనల్ టచ్‌తో ఉంది. విజరు ట్యూన్‌ను అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశాడు అనురాగ్ కులకర్ణి. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలుండటంతో ఈ సమ్మర్‌కు మంచి రిజల్ట్ అందుకుంటుందనే దీమాని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ ఆంటోనీ ఈ చిత్రంలో హీరోగానే కాక ఎడిటింగ్, మ్యూజిక్‌ను కూడా అందిస్తున్నారు. అలాగే తన సొంత బ్యానర్ విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్లో నిర్మితమైన ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఆయనే. విజయ్ ఆంటోని సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది.