Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అప్పటి ప్రేమగాథే అయినప్పటికీ ఇప్పటి తరానికి కూడా 'శాకుంతలం' బాగా కనెక్ట్ అవుతుంది' అని దర్శకుడు గుణశేఖర్ చెప్పారు. సమంత ప్రధాన పాత్రధారిణిగా ఆయన తెరకెక్కించిన చిత్రం 'శాకుంతలం'. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమా ఈనెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు గుణశేఖర్ ఈసినిమా విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు. ౖ'హిరణ్యకశ్యప' కోసం ఐదేండ్లు పనిచేశా. కరోనా కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పుడు ఓ మంచి ప్రేమకథని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యా. మహాభారతంలోని అద్భుతమైన ప్రేమ కథగా మనం చెప్పుకునే దుష్యంత, శకుంతల ప్రేమగాథను మహా కవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం కావ్యంగా రాశారు. దాన్ని ఆధారంగా చేసుకుని విజువల్ వండర్‌గా ప్రజెంట్ చేశాను. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలున్నాయి. శాకుంతలంగా సమంత అందం, అమాయకత్వం కలగలిపిన నటన, దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ లుక్.. వారి మధ్య ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగ ప్రయాణం ఎంత హద్యంగా ఉంటుంది. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా వావ్ అనిపించేలా ఉంటాయి. దుర్వాస మహామునిగా మోహన్ బాబు.. చిన్ననాటి భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఇలా ప్రతీ అంశం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది' అని తెలిపారు.