Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీసింహ కోడూరి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో, హీరోయిన్లుగా వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యార్స్‌పై ఫణిదీప్ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్న చిత్రం 'ఉస్తాద్'. ఈ సినిమా టీజర్‌ను బుధవారం రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందరూ మంచి సినిమా చేసుంటారని అనుకుంటు న్నాను. పవన్ కళ్యాణ్ టైటిల్ లాంటిదే ఓ మోటర్ బైక్‌కి పెట్టాశాడంటే డైరెక్టర్ ఫణిదీప్ గట్స్ వేరే లెవల్ అని అర్థమవుతుంది' అని తెలిపారు. 'ఈ సినిమాలో హీరోకి బైక్ ఎలాగైతే ఉస్తాద్ అయ్యిందో నాకు కూడా అలాగే అయ్యింది. ఎందుకంటే నాకు బైక్ సరిగా రాదు. షూటింగ్ సమయంలోనే బాగా నేర్చుకున్నాను. చాలా మంచి జ్జాపకాలు న్నాయి. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను' అని హీరో శ్రీసింహ అన్నారు.
నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, 'టీజర్లో మీరు చూసింది చాలా చిన్నది. సినిమా చాలా పెద్ద రేంజ్లో ఉంటుంది. సాయికొర్రపాటికి థ్యాంక్స్. ఆయనిచ్చిన భరోసాతోనే ఈరోజు ఇలా నిలబడ్డాం' అని చెప్పారు.