Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేవైఎం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మాదరి శ్రీకాంత్
నవతెలంగాణ- తాడ్వాయి
ప్రజాసేవలో యువత ముందుండాలని భారతీయ జనతా యువమోర్చా ములుగు జిల్లా ఉపాధ్యక్షులు మాదరి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. గురువారం పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు మాదరి శ్రీకాంత్ మాట్లాడుతూ అధికార దర్పంతో ప్రవర్తించిన ఎందరో కాలగర్భంలో కలిసిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఆత్మహత్యలపై సిబిఐ దర్యాప్తు చేయించాలని కేంద్రానికి బీజేవైఎం ములుగు జిల్లా ఉపాధ్యక్షులు సూచించారు. యువత కు మోడీ ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది అన్నారు. ఈసారి రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి బిజెపి కార్యకర్త, బీజేవైఎం కార్యకర్త లు కంకణ బద్ధులై విధులు నిర్వహించాలని కోరారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కార్యం ఇస్తారు యోజన కింద పార్టీ మరియు దాని పథకాల గురించి ప్రతి ఇంట్లో ప్రచారం చేయాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ స్వరాజ్ యోజన కింద ఆయుష్మాన్ భారత్, అభియాన్ కిసాన్ కళ్యాణ్ మరియు కౌశల్ వికాస్ యోజన తదితర సంక్షేమ పథకాలను కేంద్రం పేద ప్రజల గురించి ప్రవేశపెట్టిందన్నారు. పేద ప్రజల సంక్షేమం గురించి బీజేవైఎం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.