Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్'. ఈనెల 28న బిగ్ స్క్రీన్స్ పైకి రానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పింది. అలాగే టీజర్ నేషనల్వైడ్ ట్రెండ్ అవ్వగా, ఇప్పటికే విడుదలైన పాటలు కూడా మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి బార్సు సెలబ్రేట్ చేసుకునే బ్రేక్-అప్ సాంగ్ 'రామా కృష్ణా' పాటని విడుదల చేశారు. ఇది బ్రేక్-అప్ సాంగ్ అయినప్పటికీ,హీరో జీవితాన్ని బ్రేకప్ ప్రభావితం చేయలేదని చాలా ఆసక్తికరంగా వినోదాత్మకంగా చెప్పారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకు హిప్ హాప్ తమిళ పెప్పీ నంబర్ని స్కోర్ చేయగా, రామ్ మిర్యాల ఈ పాటని ఎనర్జీటిక్గా పాడారు. అఖిల్ ఒక సాధువులా కాషాయ దుస్తులతో కనిపించడం సర్ప్రైజింగ్గా ఉంది. కలర్‌ఫుల్ సెట్లో చిత్రీకరించిన పాటలో సాక్షి వైద్య కూడా కాషాయం ధరించి మెరిసింది. దీనికి శేఖర్ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట అందర్నీ అలరిస్తోంది.