Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మ్యూజిక్ స్కూల్' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫుట్ ట్యాపింగ్ ఫస్ట్ సాంగ్ 'చదువే చదువంటారు'కి చాలా మంచి స్పందన వచ్చింది. ఆ జోష్‌తోనే జబర్దస్త్ మెలోడీ, రొమాంటిక్ సాంగ్ 'ఏవో సరాగాలు'ను మేకర్స్ విడుదల చేయగా, దీనికి మంచి స్పందన లభించింది. ఇళయరాజా స్వరపరిచిన 'ఏవో సరాగాలు..' పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా, శ్రేయా ఘోషల్, జావేద్ అలీ ఆలపించారు. ఆడమ్ ముర్రే కొరియోగ్రఫీ చేశారు.ఐఏయస్ ఆఫీసర్‌గా పనిచేసి, ఫిల్మ్ మేకర్‌గా మారిన పాపారావు బియ్యాల మాట్లాడుతూ, 'సున్నితమైన కథాంశంతో మ్యూజిక్ స్కూల్ తెరకెక్కిస్తున్నాం. మన విద్యావిధానంలో విద్యార్థుల మీద సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. కానీ ఎలా ఉండాలనే విషయాన్ని చెబుతూ సినిమా చేశాం. ఇందులో మొత్తం పదకొండు పాటలున్నాయి. వాటిలో మూడు పాటలు మరింత హృద్యంగా, మన భారతీయ సంగీతాన్ని ప్రతిధ్వనించేలా ఉంటాయి' అని చెప్పారు. యామని ఫిల్మ్స్ సమర్పిస్తున్న సినిమా ఇది. హిందీ, తెలుగులో ఏకసమయంలో చిత్రీకరించారు.తమిళ్లో అనువాదం చేశారు. మే 12న హిందీలో పీవీఆర్ సంస్థ, తెలుగులో దిల్‌రాజు విడుదల చేస్తున్నారు.