Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం 'రామబాణం'. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ 'దరువెయ్యరా'ను కర్నూల్లో జరిగిన ఈవెంట్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. మిక్కీ జె మేయర్ అద్భుతమైన ఆల్బమ్‌ని స్కోర్ చేశారు.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ,'నిర్మాత విశ్వ ప్రసాద్‌తో ఇదే నా మొదటి సినిమా. ఈ పాటని లాంచ్ చేసిన టీజీ వెంకటేష్‌కి కృతజ్ఞతలు. 'యజ్ఞం' సమయంలో ఆయన్ని కలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆయన సాంగ్ లాంచ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మిక్కీ జే మేయర్ చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మిగతా సాంగ్స్ కూడా ఎక్స్‌ట్రార్డినరిగా ఉంటాయి. హయాతి చాలా బాగా చేసింది. తను పెద్ద హీరోయిన్ అవుతుంది. శ్రీవాస్‌తో 'లక్ష్యం, లౌక్యం' లాంటి విజయవంతమైన చిత్రాలు చేశాను. ఈ సినిమా కూడా ఆ స్థాయిలో విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాని చాలా బాగా తీశారు' అని తెలిపారు. 'ఇందులోని 'ఐఫోన్..' సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండో పాటని కర్నూల్ వేదికగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. గోపిచంద్, నేను కలిసి సినిమా చేస్తున్నపుడు అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. అలాంటి పాజిటివ్ వైబ్స్‌తో ఈ సినిమా చేశాం. అభిమానుల అంచనాలను అందుకునే కంటెంట్ మా దగ్గర ఉంది. డింపుల్ చాలా క్రేజీగా చేసింది. నిర్మాత విశ్వ ప్రసాద్‌ది చాలా పెద్ద విజన్. ఇండియాలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బెస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. మే 5న అందరూ ఈ సినిమా చూడాలి' అని దర్శకుడు శ్రీవాస్ చెప్పారు. నాయిక డింపుల్ హయాతి మాట్లాడుతూ, ''దురువేరు రా' రామబాణం ఆల్బంలో నా ఫేవరేట్ సాంగ్. ఇందులో వింటేజ్ గోపీచంద్ గుర్తుకు వస్తున్నారు. మా దర్శకుడు చాలా కేర్ తీసుకుని చేశారు. టీజీ విశ్వప్రసాద్ ప్రొడక్షన్లో పని చేయడం ఆనందంగా ఉంది' అని అన్నారు.
'ఈ పాటని కర్నూల్లో లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఏదో ఒక ఈవెంట్ కర్నూల్లో చేయడానికి ప్లాన్ చేస్తుంటాం. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాల మాదిరిగానే ఈ సినమా కూడా విజయం ఖాయం. అందరూ థియేటర్‌కి వచ్చి మా 'రామబాణం' చిత్రాన్ని ఆదరించండి' అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. సమ్మర్ కానుకగా మే 5న 'రామబాణం' ప్రేక్షకుల ముందుకు రానుంది.