Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభాహొరంజన్, మహేందర్ బర్గాస్ హీరోలుగా, సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి,హొపెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన సినిమా 'భారతీయన్స్'. భారత్ అమెరికన్హొక్రియేషన్స్ పతాకంపై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. 'ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా' చిత్ర రచయిత దీన్ రాజ్ ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని మాజీ ఉప రాష్ట్రపతిహొఎం.వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం ప్రసాద్ లాబ్స్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 'దేశ సమైక్యత, భారతీయ సైనికుల వీరగాథ గురించిహొఇటువంటి మంచి దేశభక్తి సినిమా తీయడం అభినందనీయం. దర్శక, నిర్మాతలు యువతకు చక్కటి సినిమా అందిస్తున్నారు' అని అన్నారు.'నా దృష్టిలో ప్రతి భారతీయుడు రియల్ హీరోనే. సామాన్య స్త్రీ మదర్ ఆఫ్ ఇండియా. భారతీయులు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న ఫిలాసఫీని 'భారతీయన్స్' ద్వారా గుర్తు చేస్తున్నాం. ఇది పాన్ ఇండియా సినిమా.హొమేలోహొఅన్ని భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం' అని నిర్మాత డా. శంకర్ నాయుడు అడుసుమిల్లి చెప్పారు. దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ, 'దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని గుర్తు చేసే, పెంపొందించే చిత్రమిది. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి.హొ ఫ్యామిలీ కలిసి చూదాల్సిన సినిమా' అని అన్నారు.