Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు ఫిలిం ఇండిస్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 2023-2025 సంవత్సరానికిగాను ఫెడరేషన్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్ వల్లభనేని, సెక్రటరీగా పీఎస్ఎన్ దొరను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారిగా సురేష్ పోటీలో గెలిచారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్‌కుమార్ మాట్లాడుతూ, 'మరోసారి మా ప్యానెల్ పై నమ్మకం ఉంచి ఘన విజయాన్ని అందించిన కార్మిక సోదర సోదరీమణులకు, 24 కార్మిక సంఘాల నాయకులకు, తోటి కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు. ఇండిస్టీలో ఉన్న 25 వేల మంది కార్మికుల కష్టనష్టాలు తెలిసిన నాయకులుగా మరొకమారు మమ్మల్ని కార్మికులు గుర్తించారు. ఫెడరేషన్‌కు, సినిమా కార్మికులకు తగు న్యాయం చేస్తాం' అని చెప్పారు.