Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గబ్బర్ సింగ్' తర్వాత పవన్కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో మరో మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
ప్రధాన తారాగణం, ఇతర ముఖ్య నటీనటులపై తెరకెక్కించిన కీలక సన్నివేశాలతో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ముగిసింది. ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్లో స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్, వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు అలాగే భారీగా రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్లో మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. నాయిక శ్రీలీలతో పాటు నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి పలువురు నటీనటులు ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు.