Authorization
Mon Jan 19, 2015 06:51 pm
16 అరుదైన ప్రపంచ రికార్డులతో వరల్డ్ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. ఈ స్పిన్ మాంత్రికుడు 2002లో విస్డెన్స్ క్రికెటర్స్ అల్మానాక్తో అత్యుత్తమ టెస్ట్ మ్యాచ్ బౌలర్‌గా పేరు పొందారు. 2017లో ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించిన మొదటి శ్రీలంక క్రికెటర్ కూడా. ఈ లెజెండరీ స్పిన్నర్‌పై రూపొందుతున్న బయోపిక్ '800'. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ఎం.ఎస్. శ్రీపతి. స్లమ్‌డాగ్ మిలియనీర్ మధుర్ మిట్టల్ స్పిన్ మాంత్రికుడి పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కెరీర్లో 800 టెస్ట్ వికెట్స్ తీసిన ఏకైక ఆఫ్ స్పిన్నర్ బౌలర్‌గా అరుదైన రికార్డు మురళీధరన్ ఖాతాలో ఉంది. అందుకే ఈ చిత్రానికి '800' అనే టైటిల్‌ను పెట్టారు. సోమవారం మురళీధరన్ పుట్టినరోజు. ఆయనకు బర్త్‌డే కానుకగా మేకర్స్ స్టంప్స్‌తో ఉన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ స్పోర్ట్స్ డ్రామా సివిల్ వార్ నడుమ మురళీధరన్ చేసిన ప్రయాణానికి ప్రతిబింబంగా ఉంటుంది.