Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కంటేశ్వర్
ఇమోఫిలియా ఓరోగులకు రక్త దారకు అడ్డుకట్టుగా జి జి హచ్ లో ఇమోఫిలియా వాడు ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దాదన్నగారి విట్టల్ జిల్లా పరిషత్ చైర్మన్, నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్ చేతుల మీదుగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిజామాబాద్ లో హిమోఫిలియా సొసైటీ ఆఫ్ నిజామాబాద్ సహకారంతో హిమోఫిలియా వార్డు ప్రారంభోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విట్టల్ రావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ మాట్లాడుతూ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఇప్పటివరకు ఎన్నో సౌకర్యాలు కల్పించి మరియు ఇప్పుడు హిమోఫిలియా వార్డ్ ఏర్పాటుకు ప్రోత్సహించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి చాలా అభివృద్ధి చెందినదని, అన్ని రకాల సౌకర్యాలు అమలులో ఉన్నాయని బయట పేషెంట్లు 700 నుంచి 1500 వరకు పెరగారని, ఆస్పత్రి సిబ్బందికి అభినందనలు తెలిపారు .ప్రతి సంవత్సరం ఎంతోమందిని పీడిస్తున్న రక్త సంబంధ వ్యాధులలో ప్రధానమైన వ్యాధి ఈ హిమోఫిలియా లేదా రక్తం గడ్డ కట్టనిస్థితి ఈ వ్యాధి వలన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో
150- 250 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారని హిమోఫిలియా సొసైటీ నిజామాబాద్ ద్వారా తెలిసిందని, వారి సహకారంతో వారందరూ ఇక్కడ ఉచితంగా చికిత్సను పొందవచ్చునని తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమ రాజ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ హిమోఫిలియా ద్వారా నిజామాబాద్ జిల్లాలో ఎంతమంది బాధపడుతున్నారని ప్రభుత్వానికి విన్నవించగా ప్రత్యేక వార్డుకు అనుమతించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వార్డు ద్వారా హిమోఫిలియా లోని వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారందరూ ఉపశమనం పొందవచ్చునని ఈ అవకాశాన్ని వారు వినియోగించుకోవాలని ఈ వార్డు ఏర్పాటుకు సహకరించిన హిమోఫిలియా సొసైటీ నిజామాబాద్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ ఆనంద్ రావు హిమోఫిలియా సొసైటీ ప్రెసిడెంట్,
సంతోష్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ జిజిహెచ్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.