Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ 'విరూపాక్ష'. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అగ్ర దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో హీరో సాయిధరమ్ తేజ్ ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం మీ కోసం ప్రత్యేకం..
'80, 90వ దశకంలో ఈ కథ ఉంటుంది. వరుసగా జరిగే మిస్టరీ డెత్‌లు ఏంటి?, ఊరి మీద చేతబడి చేయించారా?, చేస్తే ఎవరు చేసి ఉంటారు? అనే దాని చుట్టూ జరిగే కథే 'విరూపాక్ష'. అయితే ఇలాంటి సినిమాలకు ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉంటుంది. కానీ ఈ కథ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. అదే ఈ సినిమా ప్రత్యేకత. ఇందులో పాటలకు ఎక్కువ స్కోప్ ఉండదు. 'షెర్లాక్ హోమ్స్' టైపులో ఉంటుంది. ప్రతీ పదిహేను నిమిషాలకు ఏదో ఒక కొత్త క్యారెక్టర్ వస్తుంది. పాటలతో బోర్ కొట్టించాలని మేం అనుకోలేదు. యాక్సిడెంట్ తరువాత చిరంజీవి గారు ఓ కొటేషన్ పంపించారు. 'ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి' అంటూ సిరివెన్నెల గారు రాసిన పాటలోని లైన్స్‌ను పంపించారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో అనుక్షణం ముందుకు సాగుతున్నాను. ప్రమాదం జరిగిన తరువాత మళ్లీ నేను సినిమాలు చేస్తానా? లేదా? అని అంతా అనుకున్నారు. కానీ మా అమ్మ నాకు 36 ఏళ్ల వయసులో మళ్లీ మాటలు నేర్పించింది. ఎంతో సహనంతో నాకు సపోర్ట్‌గా నిలిచింది. అందుకే ఈ లైఫ్‌లో మనం ఏది చేసినా కూడా అమ్మానాన్నలు, గురువు కోసం చేయాలి.సుకుమార్ రైటింగ్స్ అంటే ప్రేమ కథలుంటాయి. ఈ సినిమాలోనూ అండర్ లైన్‌గా లవ్‌స్టోరీ, ఎమోషన్స్ ఉంటాయి. సినిమా చూశాకా ప్రేక్షకులకే అర్థం అవుతంది. అయితే ఆ ప్రేమకథ గురించి నేను ఇప్పుడేం చెప్పలేను. ఇది టిపికల్ జోనర్ సుకుమార్ స్క్రీన్ ప్లే సినిమాకు అద్భుతంగా సెట్ అయింది. దర్శకుడు కార్తీక్ 2019లో నాకు కథ చెప్పాడు. హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, మారుతి తరువాత అంత బాగా నాకు నెరేట్ చేశాడు. అప్పుడు కథపై నాకు ఎంతో నమ్మకం కలిగింది. సినిమాను తను అద్భుతంగా తీస్తాడని అనిపిం చింది. సుకుమార్ ఇచ్చిన స్క్రీన్ ప్లేకి కార్తీక్ అత్యద్భుతంగా డైరెక్ట్ చేశాడు. నిర్మాత బివీఎస్ఎన్ ప్రసాద్, బాపీ ఇండిస్టీలోకి రాక ముందు నుంచి నాకు తెలుసు. ప్రసాద్‌గారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఆయనలో నాకు అదే ఇష్టం. 'ఆర్ఆర్ఆర్' సినిమా తరువాత ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తోంది. ఇప్పుడు మనం తెలుగు సినిమా సత్తాను వరల్డ్ వైడ్‌గా చాటుతున్నాం.