Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ దర్శక, నిర్మాత దివంగత యశ్ చోప్రా భార్య, నిర్మాత, గాయని పమేలా చోప్రా (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను 15 రోజుల క్రితం ముంబై లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. న్యూమోనియాతో బాధపడుతున్న పమేలా చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. పమేలా భర్త, ప్రముఖ నిర్మాత యశ్‌చోప్రా 2012లో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె పెద్ద కుమారుడు ఆదిత్య చోప్రా దర్శక, నిర్మాతగా, మరో కుమారుడు ఉదరు చోప్రా నటుడిగా బాలీవుడ్లో రాణిస్తున్నారు. పమేలా చోప్రా 1970లో యశ్ చోప్రాను వివాహం చేసుకున్నారు. ఎన్నో హిట్ సినిమాల్లో పాటలు పాడి గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కథా రచయితగా, గాయనిగా, కాస్ట్యూమ్స్ డిజైనర్‌గానే కాకుండా యశ్ రాజ్ సంస్థలో పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే నిర్మాతగా కొన్ని సినిమాలనూ నిర్మించారు. యశ్ చోప్రా దర్శక, నిర్మాతగా రూపొందిన 'దిల్ తో పాగల్ హై', 'కబీ కబీ' చిత్రాలకు పమేలా రచయితగా పనిచేశారు. పమేలా మృతి పట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.