Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో గతంలో 'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్లు వచ్చాయి. ఇప్పుడు వారి కాంబోలో హ్యాట్రిక్ ఫిల్మ్‌గా 'రామబాణం' రాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుషఉ్బ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మే 5న ఈ సినిమా థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ విడుదల వేడుక రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ, 'దర్శకుడు వాసుతో ఇది నా మూడో సినిమా. 'లక్ష్యం, లౌక్యం' సినిమాలు ఎలా ఉన్నాయో.. ఇది కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చూసేటప్పుడు ఇది మన ఇంట్లో జరుగుతున్న కథలా అనిపిస్తుంది. అంతగా లీనమై ఈ సినిమా చూస్తారు. అలీ, నా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం నిర్మాత విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ వేసవిలో మీరు మా సినిమా చూసి కచ్చితంగా ఎంజారు చేస్తారు. ఈ సినిమాకి రామబాణం అనే టైటిల్ పెట్టినందుకు బాలకృష్ణకి ప్రత్యేక కృతజ్ఞతలు' అని అన్నారు.
''లక్ష్యం, లౌక్యం' సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో.. ఈ రామబాణం కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాలో జగపతి బాబు, గోపీచంద్ నటించిన ప్రతి సన్నివేశం చూస్తుంటే.. నిజంగానే అన్నదమ్ములేమో అనిపిస్తుంది. కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబంలోని రకరకాల ఎమోషన్స్ గురించి ఈ సినిమాలో చాలా బాగా చేశాం. ఈమధ్య కాలంలో నేను ఎక్కువగా విన్న మాట.. హిట్ సినిమాలు వస్తున్నాయి కానీ, సరదాగా అందరూ కలిసి చూసే సినిమాలు రావట్లేదని. మా సినిమా అలాంటి సినిమానే. ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి చూడొచ్చు.. మిమ్మల్ని ఈ సినిమా అసలు నిరాశపరచదు. గోపీచంద్ ఇప్పటిదాకా చేసిన అన్ని సినిమాల కంటే నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ఈ సినిమా చూస్తుంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకులు కంటతడి పెడతారు' అని దర్శకుడు శ్రీవాస్ చెప్పారు.
కథానాయిక డింపుల్ హయతి మాట్లాడుతూ, 'కుటుంబ బంధాలతో పాటు ఇందులో కామెడీ, పాటలు అన్ని ఉంటాయి. ఇంత మంచి సినిమాలో భాగమై నందుకు చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు. 'సినిమా చాలా బాగా వచ్చింది. చాలా కాలం తర్వాత మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో, మంచి యాక్షన్‌తో వస్తున్న సినిమా. ఇది వేసవి కాలంలో వస్తోంది. కుటుంబంతో కలిసి వెళ్లి చూడదగ్గ సినిమా' అని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కుమార్తె కృతి మాట్లాడుతూ, 'ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. మే 5న ప్రేక్షకులంతా థియేటర్లకు వెళ్లి ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.