Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాంది' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత అల్లరి నరేష్, విజరు కనకమేడల కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఉగ్రం'. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఖమ్మంలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి పువ్వాడ అజరు కుమార్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ, ''ఉగ్రం' నా సినిమా షష్టిపూర్తి. 60వ చిత్రం (నవ్వుతూ). 'మహర్షి' తర్వాత 'నాంది' కథ చెప్పారు. నాపై కామెడీ ఇమేజ్ ఉంది కదా చూస్తారా? అని దర్శకుడిని అడిగాను. రిస్క్ చేద్దామన్నారు. ఆ రిస్క్ పే చేసింది. మళ్ళీ 'ఉగ్రం' కథ చెప్పినపుడు ఇంత యాక్షన్ సీక్వెన్స్‌లు చూస్తారా? అంటే నమ్మండి సార్ అన్నాడు. 'నాంది'లో అండర్ ట్రయిల్ ఖైదీలు గురించి చెప్పాం. ఇందులో మిస్సింగ్ కేసులు గురించి చెప్పాం. చాలా రీసెర్చ్ చేసిన కథ ఇది. నాంది కంటే పదిరెట్లు ఇంటెన్స్ ఉంటుంది' అని అన్నారు. 'ఉగ్రం, నాందికి పదిరెట్లు ఉంటుంది. 'నాంది'లానే ఇందులో కూడా ఒక సోషల్ కాజ్ ఉంటుంది. మిస్సింగ్ అనే యూనిక్ పాయింట్‌ని తీసుకొని ఈ కథ చేశాం. ఇందులో ఎమోషన్ ఉగ్ర రూపంలో ఉంటుంది. యాక్షన్ దద్దరిల్లుతుంది' అని దర్శకుడు విజరు కనకమేడల చెప్పారు.