Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కలయికలో రూపొందిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ 'ఏజెంట్'. ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా గురించి హీరో అఖిల్ అక్కినేని మీడియాతో ముచ్చటించారు.
'ఒక కొత్త తరహా యాక్షన్ సినిమాతో ఫ్రెష్ కంటెంట్‌ని ఇవ్వాలనే ప్రయత్నంతో స్పై జోనర్‌ని ఎంపిక చేసుకోవడంతో 'ఏజెంట్' జర్నీ మొదలైయింది. ఈ సినిమా జోనర్ నాకు బాగా నచ్చేసింది. అయితే దర్శకుడు సురేందర్‌రెడ్డి నెరేట్ చేసినప్పుడు ఇంత క్రేజీగా చేయగలుగుతానా లేదా అనేది డౌట్. ఎందుకంటే ఇంతకుముందు ఇలాంటింది చేయలేదు. ఈ పాత్ర కోతిలానే బిహేవ్ చేస్తుంది. ప్రతి క్షణం ఒక హైలో మాట్లాడాలి. అది నాకు చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే.. వ్యక్తిగతంగా నేను కొంచెం సిగ్గుపడతాను. అయితే కొంత జర్నీ తర్వాత ఆ పాత్ర అలవాటైపోయింది. గతంలో కూడా కొన్ని యాక్షన్ స్పై సినిమాలు వచ్చాయి. వాటితో పోలిస్తే 'ఏజెంట్' చాలా ప్రత్యేకమైన సినిమా. మమ్ముట్టి లాంటి పెద్ద స్టార్‌ని ఎందుకు ఇందులో తీసుకున్నామో విడుదల తర్వాత మీరే చెప్తారు. ఇది కేవలం ఒక్క హీరో వైపు నుంచే నడిచే సినిమా కాదు. మూడు పాత్రలు మధ్య ఇంటెన్స్ డ్రామా జరిగే సినిమా ఇది. మమ్ముట్టి పాత్రతో నేను ప్రేమలో పడిపోయాను. అంత అద్భుతంగా వచ్చింది. కథ ఓ కొత్త ప్రపంచంలో జరుగుంటుంది. కంప్లీట్‌గా న్యూ సెటప్. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో నా పాత్ర పేరు రిక్కీ. తను చాలా వైల్డ్. ఎవరూ ఊహించని విధంగా డీల్ చేస్తాడు. ఏజెంట్.. వెరీ వైల్డ్ (నవ్వుతూ).
అయితే స్పై జోనర్ తీసుకున్నాం కాబట్టి కథ సీరియస్‌గా సాగుతుంది. కానీ మాస్ ఆడియన్స్‌కి నచ్చేలా యంగేజింగ్ ఎంటర్టైనింగ్గా ఉండటానికి స్క్రిప్ట్ దశలోనే చాలా వర్క్ చేశాం. స్పై అనే వాడు నీడలో ఉంటూ అందరితో బ్లెండ్ అయిపోయి ఉండాలి. కానీ ఈ ఏజెంట్ కంప్లీట్ రివర్స్. అన్ ప్రెడిక్ట్ వైల్డ్ మంకీలా ఉంటాడు. సెపరేట్ కామెడీ స్పై రన్ని డిస్ట్రబ్ చేస్తుంది. అందుకే హ్యూమర్‌ని కథానాయకుడి పాత్రలోనే ఉండేట్లు చూసుకున్నాం. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సీరియస్ యాక్షన్ సీన్లో కూడా తను హ్యుమర్ తీసుకొచ్చేస్తాడు. క్యారెక్టర్ వైల్డ్ నెస్ వలన అది వర్క్ అవుట్ అయ్యింది. సురేందర్ పాత్రలు మాములుగానే క్రాక్‌గా ఉంటాయి. దాని వలన సినిమా ఎగ్టైటింగ్‌గా అయిపోతుంది. ఏప్రిల్ 28న .. పోకిరి, బాహుబలి 2 .. ఇలా చాలా ఇండిస్టీ హిట్లు ఉన్నాయి. అదే డేట్‌కి నా సినిమా కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. 'పోకిరి, బాహుబలి 2' నా ఆల్ టైం ఫేవరేట్ మూవీస్. వ్యక్తిగతంగా నాకు పెద్దగా సెంటిమెంట్లు ఉండవు. కానీ ఇది చెప్పినపుడు ఇదొక బ్లెస్సింగ్లానే భావించాను. హిపాప్ తమిళది బ్రిలియంట్ టీం. ఏదో కొత్తగా ఇవ్వాలని తపన పడే కంపోజర్స్. ఆది, జీవా చాలా క్రేజీ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా పాటలో నటించారు. ఈ పాట క్లైమాక్స్‌లో వస్తుంది. నాయిక సాక్షి అద్భుతంగా నటించింది.