Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ నటుడు శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు లోనైన విషయం తెలిసిందే. ఆయన్ని ఈ నెల 20న హైదరాబాద్‌లోని ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేర్పించారు. అయితే ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని, శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో ఆ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయంతోపాటు ఇతర అవయవాలపై పడ్డట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పైనే చికిత్సనందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీలో జాయిన్ చేశారు.